సన్న బియ్యం ఎందుకు ఇవ్వలేదంటూ గత పాలకులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిలదీత
రిపోర్టర్: కృష్ణ
స్థలం: ఖమ్మం
పేదల ఆకలి తీర్చడానికి గత పదేళ్లలో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ఎందుకు తీసుకురాలేకపోయారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ప్రజా భవన్లో మీడియాతో మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో రాష్ట్రంలోని కోటి ఆరు లక్షల కుటుంబాలకు ఒక్కొక్కరికీ ఆరు కేజీల చొప్పున సన్న బియ్యం అందిస్తోందని తెలిపారు. పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆయన స్పష్టం చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.