అక్టోబర్ 9 నుంచి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్!
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: India
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ నిర్వహించే బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 9 నుంచి ప్రారంభం కానున్నట్లు సోషల్ మీడియాలో లీకులు వస్తున్నాయి. ప్లస్ సభ్యులకు ఒక రోజు ముందుగానే అక్టోబర్ 8 నుంచి యాక్సెస్ లభించే అవకాశం ఉంది. యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్ లభించనుండగా, అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.