తీరానికి తీవ్ర తుఫాను ముప్పు: సముద్రంలో చిక్కుకున్న ఏడుగురు మత్స్యకారులు రెస్క్యూ

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: నెల్లూరు

మురసు తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో తీరప్రాంతం అల్లకల్లోలంగా మారిందని, సముద్రంలో వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు జువ్వలదిన్నె తీరంలో చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. అలల తాకిడి ఎక్కువగా ఉండటంతో తీరానికి అయిదు కిలోమీటర్ల దూరంలో బోటు లంగరు వేసుకున్నట్లు పేర్కొన్నారు. స్థానిక మత్స్యకారుల సహకారంతో అధికారులు స్పందించి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించిన మత్స్యశాఖ అధికారులను, మత్స్యకారులను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రత్యేకంగా అభినందించారు.