విజయవాడ కృష్ణలంక కస్టోడియల్ డెత్: సీబీఐ విచారణ మరింత వేగవంతం

రిపోర్టర్: రాము స్థలం: విజయవాడ

విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ కస్టోడియల్ డెత్ కేసులో సాయికృష్ణ మృతి దర్యాప్తును సీబీఐ అధికారులు మూడో రోజు మరింత వేగవంతం చేశారని అధికారులు తెలిపారు. కీలకమైన సాక్ష్యాధారాల సేకరణలో భాగంగా సీబీఐ బృందం బెజవాడలోని స్థానిక స్వర్గపురికి చేరుకుని సుదీర్ఘంగా తనిఖీలు నిర్వహించింది. శ్మశానవాటిక రికార్డులను, అంత్యక్రియల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు సిబ్బందిని గంటపాటు విచారించి పలు కీలక సమాచారాన్ని సేకరించినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి.