మహిళ పట్ల ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అమానుష ప్రవర్తన
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: హఫీజ్‌పేట్
తెలంగాణలోని హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ పరిధిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మియాపూర్-హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ల సమీపంలో ఓ మహిళపై ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు. మహిళను విచక్షణారహితంగా కొట్టి, ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన దృశ్యాలు తీవ్ర కలకలం రేపాయి. పోలీసుల తీరుపై స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, బాధ్యుడైన కానిస్టేబుల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.