డిపాజిట్ సొమ్ము కోసం మంచంతో సహా సహకార సంఘం ఎదుట నిరసన

రిపోర్టర్: శివ స్థలం: తూర్పుగోదావరి

తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలో విచిత్ర నిరసన చోటుచేసుకుంది. సహకార సంఘంలో దాచుకున్న డిపాజిట్ సొమ్ము ఇవ్వకపోవడంతో, బాధితుడు నర్సింహమూర్తి దంపతులు మంచంతో సహా వచ్చి కార్యాలయం ఎదురుగా పడుకుని నిరసన తెలిపారు. 180 మంది రైతులకు చెందిన రూ.4.40 కోట్ల డిపాజిట్లు దుర్వినియోగమైనట్లు తేలినా, ఇప్పటికీ తమకు న్యాయం జరగలేదని వారు వాపోయారు.