విజయనగరం ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ అద్భుత చరిత్ర
రిపోర్టర్: శివ
స్థలం: విజయనగరం
ఉత్తరాంధ్ర ప్రజల ప్రధాన ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న శ్రీ పైడితల్లి అమ్మవారి చరిత్ర ఎంతో విశిష్టమైనదని ఆలయ అర్చకులు తెలిపారు. విజయనగరం సంస్థానాన్ని పరిపాలించిన పూసపాటి రాజుల ఇలవేల్పుగా వెలసిన పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవం అక్టోబర్ 27న అట్టహాసంగా జరగనుంది. బొబ్బిలి యుద్ధం నేపథ్యంలో చరిత్రలో నిలిచిన ఈ అమ్మవారి ఆలయ విశేషాలు, పూసపాటి వంశంతో ఉన్న చారిత్రక సంబంధం మరియు పెద్ద చెరువులో అమ్మవారు లీనమైన పురాణగాథ ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.