చేనేత పింఛన్ల దరఖాస్తులలో అక్రమ వసూళ్లపై ఇద్దరు అధికారుల సస్పెన్షన్
రిపోర్టర్: సతీష్
స్థలం: శ్రీసత్యసాయి జిల్లా
శ్రీసత్యసాయి జిల్లాలో చేనేత పింఛన్ల దరఖాస్తుల పరిశీలనలో అక్రమ వసూళ్లకు పాల్పడిన డీవో రమణారెడ్డి, ఏడీవో శీనానాయక్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మంత్రి సవితకు వచ్చిన ఫిర్యాదుల మేరకు స్పందించిన అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. అర్హులైన నేతన్నలు ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.