ములుకలపల్లిలో కొట్టుకుపోయిన చప్టా: హై లెవల్ వంతెన నిర్మించాలని నేతల డిమాండ్

రిపోర్టర్: కృష్ణ స్థలం: భద్రాద్రి కొత్తగూడెం

ములకలపల్లి మండల పరిధిలోని పూసుగూడెం–వీకే రామవరం మధ్య లో లెవల్ చప్టా వరద ఉధృతికి కొట్టుకుపోయిందని, వెంటనే వంతెన నిర్మించాలని స్థానిక సర్పంచ్ గుగులోత్ ధర్మా, బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మురసు తుఫాన్ ప్రభావంతో వరదలకు రోడ్డు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రూ.1.60 కోట్లు మంజూరై శంకుస్థాపన జరిగినా పనులు ప్రారంభం కాలేదని విమర్శిస్తూ, అధికారులు తక్షణమే స్పందించి ప్రజల కష్టాలు తీర్చాలని వారు కోరారు.