చెన్నైలో సుప్రీంకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీకి విజయ్ విజ్ఞప్తి

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: చెన్నై

చెన్నైలో సుప్రీంకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. దక్షిణ భారతదేశ ప్రజలకు న్యాయం మరింత చేరువయ్యేలా చూడాలని, సుప్రీంకోర్టుతో మాట్లాడి అనుకూల నిర్ణయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆ లేఖలో స్పష్టం చేశారు.