ఫహద్ ఫాసిల్ డొంట్ ట్రబుల్ ది ట్రబుల్ ట్రైలర్ విడుదల
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
మలయాళ స్టార్ యాక్టర్ ఫహద్ ఫాసిల్ హీరోగా నటిస్తున్న తొలి తెలుగు డెబ్యూ ఫిల్మ్ డొంట్ ట్రబుల్ ది ట్రబుల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. బాహుబలి ఫేం ఆర్కా మీడియా వర్క్స్, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ఫాంటసీ చిత్రానికి శశాంక్ యేలేటి దర్శకత్వం వహిస్తుండగా, ఎస్ఎస్ రాజమౌళి సమర్పిస్తున్నారు. బాలకృష్ణ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతుండగా, అక్టోబర్ 2న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది.