టీచర్ల జోలికి వస్తే రెడ్ బుక్ చూపించి తీరుతామని మంత్రి లోకేశ్ వార్నింగ్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: అనంతపురం
అనంతపురం జిల్లా రాప్తాడులో పర్యటించిన మంత్రి నారా లోకేశ్ వైసీపీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దగ్గర రెడ్ బుక్ ఉందని, టీచర్లపై దాడులకు పాల్పడితే ఎవర్నీ వదిలిపెట్టమని హెచ్చరించారు. టీచర్ల జోలికి వస్తే ఊరుకునేది లేదని, జగన్ జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, కార్యకర్తలు కసితో పనిచేయాలని పిలుపునిచ్చారు.