తిరుచానూరులో అంకురార్పణతో వైభవంగా ప్రారంభంకానున్న శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు

రిపోర్టర్: విజయ్ స్థలం: Tiruchanoor, Andhra Pradesh

డిసెంబర్ 5 నుంచి 14 వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నట్లు TTD వెల్లడించింది. ఈ ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపడుతున్నట్లు TTD జేఈవో డాక్టర్ ఎ. శరత్ స్పష్టం చేశారు. అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రీ పద్మావతి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని TTD అధికారులు విజ్ఞప్తి చేశారు.