స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి సిద్ధం కావాలని వైకాపా శ్రేణులకు జగన్ పిలుపు

రిపోర్టర్: శివ స్థలం: అమరావతి

స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పట్ల నిబద్ధత, ప్రజాదరణ ఉన్నవారినే అభ్యర్థులుగా బరిలో నిలపాలని వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అమరావతిలో జరిగిన పార్టీ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా శ్రేణులు ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే వైకాపా ఘనవిజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.