'ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం': మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన
రిపోర్టర్: నరేష్
స్థలం: Andhra Pradesh
ప్రజల నుంచి అందిన ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి, వాటి తక్షణ పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రథమ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు.