షాకింగ్ ఘటన: సిలిండర్ గ్యాస్ లీకై ఒక్కసారిగా చెలరేగిన భారీ మంటలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: బెంగళూరు
బెంగళూరులోని మల్లేశ్వరం ప్రాంతంలో సిలిండర్ డెలివరీ చేసే సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు. గ్యాస్ లీకై ఇంటి ముందర వెలిగించిన దీపానికి తగలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అప్రమత్తమైన డెలివరీ కార్మికుడు వెంటనే వెనక్ కి జరగడంతో తృటిలో పెను ప్రమాదం తప్పిందని, దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయని అధికారులు వెల్లడించారు.