పులకించిన వేదికపై ఘనంగా ఉద్యమనేత జన్మదిన వేడుకలు
రిపోర్టర్: BALUGURI VENKHATAREDDY
స్థలం: వలిగొండ
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో ఉద్యమకారుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. మండల అధ్యక్షుడు మారగోని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా జిల్లా గౌరవాధ్యక్షుడు కళ్లెం లక్ష్మారెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు శీలం స్వామి పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల నాయకులు బొడిగే సుదర్శన్, చిలుగూరి సత్తిరెడ్డి, ఐటిపాముల పుష్ప, మల్లం వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.