పుర ఎన్నికల వ్యయంపై నిఘా: నిబంధనలు పాటించకుంటే అనర్హత వేటు తప్పదు
రిపోర్టర్: నరేష్
స్థలం: విజయనగరం
పుర ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎన్నికల ఖర్చులపై అధికారులు నిఘా పెంచారు. నామినేషన్ల దాఖలు నుంచి ఫలితాల వరకు ప్రతి ఖర్చును రోజూ విధిగా నమోదు చేయాలని పరిశీలకుడు వెంకటేష్ స్పష్టం చేశారు. ఈ నెల ఇరవై రెండు, ఇరవై ఐదు, ఇరవై ఏడు తేదీల్లో అభ్యర్థులు కమిషనర్ కార్యాలయాల్లో లెక్కలు చూపాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే మూడేళ్ల పాటు పోటీకి అనర్హత వేటు వేస్తామని హెచ్చరించారు.