అచ్యుతాపురం: కూరగాయ పంటలకు తొలకరి వర్షం వరం

రిపోర్టర్: I am Farmer 🍅🌱 స్థలం: అచ్యుతాపురం

అచ్యుతాపురం మండలంలోని మెట్ట ప్రాంతాల్లో మంగళవారం కురిసిన తొలకరి వర్షంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈ వర్షం పంటలకు ఎంతో ఊరటనిచ్చిందని, సాగు పనులు ఊపందుకుంటాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ముఖ్యంగా బెండ, వంగ, బీర, సొరకాయ వంటి కూరగాయ పంటలకు ఈ తేమ ఎంతో మేలు చేస్తుందని రైతులు తెలిపారు. సరైన సమయంలో వర్షాలు కురవడంతో దిగుబడి పెరుగుతుందనే ఆశలతో రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు.