రాష్ట్రంలో రూ.11,359 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: కుప్పం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన నుంచి వర్చువల్ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా రూ.11,359 కోట్ల విలువైన భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రాష్ట్రంలో తొలిసారిగా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ విధానంలో ఈ పనులను చేపడుతున్నట్లు తెలిపారు. 123 మున్సిపాలిటీల పరిధిలో మౌలిక వసతులు, రహదారులు, పార్కుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని, స్థానిక నాయకులు, అధికారులు పనుల పూర్తికి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.