అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు విశ్వక్ సేన్ కల్ట్ సినిమా
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
యువ హీరో విశ్వక్‌సేన్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ కల్ట్ సినిమా అక్టోబర్ 30న విడుదల కానుంది. సందీప్ కాకర్ల నిర్మిస్తున్న ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ సంభాషణలు అందిస్తుండగా, రవిబస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో స్లాషర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, ఇంగ్లీష్, జపనీస్, స్పానిష్ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.