అల్లూరి జిల్లాలో అధికారుల నిర్లక్ష్యంపై గిరిజనుల ఐక్యత విజయం

రిపోర్టర్: శివ స్థలం: అల్లూరి సీతారామరాజు

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం తాజంగి పంచాయతీ గిరిజనులు అధికారుల తీరుపై విసిగిపోయి ఐక్యత చాటారు. దశాబ్దాలుగా వాగు దాటేందుకు పడుతున్న నరకయాతనకు చరమగీతం పాడుతూ, శ్రమదానంతో స్వయంగా బలమైన కర్రల వంతెనను నిర్మించుకున్నారు. ఎవరో వస్తారని ఎదురుచూడకుండా తమ కష్టాలను తమరే తీర్చుకుంటూ ఆదర్శంగా నిలిచారు.