నాయుడుపేటలో దేశంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ తయారీ కేంద్రం ఏర్పాటు: నారా లోకేష్

రిపోర్టర్: వెంకట్ స్థలం: గుంటూరు

కేవలం పద్దెనిమిది నెలల వ్యవధిలోనే రాష్ట్రంలో పెట్టుబడి ఒప్పందం నుండి పూర్తి స్థాయి ఉత్పత్తిని ప్రారంభించినట్లు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. నాయుడుపేటలో ఏర్పాటైన ఏడు గిగావాట్ల సామర్థ్యం కలిగిన ప్రీమియర్ ఎనర్జీస్ సౌర విద్యుత్ తయారీ కేంద్రం దేశంలోనే అతిపెద్దదని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వేగంగా పారిశ్రామిక అభివృద్ధి సాధిస్తోందని, పెట్టుబడులకు రాష్ట్రం స్వర్గధామంగా మారుతోందని ఈ సందర్భంగా నారా లోకేష్ స్పష్టం చేశారు.