తుఫాను హెచ్చరికల వేళ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్న ఎమ్మెల్యే

రిపోర్టర్: GANESH BBL స్థలం: బొబ్బిలి

విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో తుఫాను ప్రభావం నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్ వి ఎస్ కే కే రంగారావు విజ్ఞప్తి చేశారు. ఎలాంటి ఆపద వచ్చినా, సహాయం కావాలన్నా ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్లను వెంటనే సంప్రదించాలని ఆయన స్పష్టం చేశారు. అధికారుల సూచనలను పాటిస్తూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు.