అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
రిపోర్టర్: మహేష్
స్థలం: అనకాపల్లి
అగ్రిగోల్డ్ బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటోందని హోంమంత్రి అనిత వంగలపూడి స్పష్టం చేశారు. బాధితుల సమస్యలు, కేసుల ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించిన ఆమె, ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తామని హామీనిచ్చారు.