నవత్రా వేడుకల్లో తీవ్ర భద్రతా వైఫల్యం: నటి ఆకాంక్ష చౌదరి సంచలన ఆరోపణలు
రిపోర్టర్: నరేష్
స్థలం: పూణే
పూణేలో జరిగిన నవత్రా వేడుకల నిర్వాహకులు తనను బలవంతంగా కారులో ఎక్కించి కిడ్నాప్ చేశారని ప్రముఖ నటి ఆకాంక్ష చౌదరి ఆరోపించారు. తన టీమ్ లేకుండానే వేదిక వద్దకు తీసుకెళ్లి తీవ్ర భయభ్రాంతులకు గురిచేశారని ఆమె వాపోయారు. తనను నిర్లక్ష్యం చేసిన నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు నటి ఆకాంక్ష చౌదరి స్పష్టం చేశారు.