స్వర్ణ గ్రామ వార్డు ఉద్యోగులకు ఆటోమేటిక్ శాంక్షన్ లీవ్ విధానం

రిపోర్టర్: అశోక్ స్థలం: ప్రకాశం

స్వర్ణ గ్రామం మరియు స్వర్ణ వార్డు ఉద్యోగుల సంక్షేమం కోసం ఎవరికీ లేనివిధంగా ఆటోమేటిక్ శాంక్షన్ లీవ్ విధానాన్ని తీసుకువచ్చామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. ఉద్యోగుల నోషనల్ ఇంక్రిమెంట్స్కు సంబంధించిన ఫైల్ను ఇప్పటికే ఆర్థిక శాఖ పరిశీలనకు పంపించినట్లు ఆయన తెలిపారు. సిబ్బంది కొరత ఉన్న ప్రాంతాల్లో ఒకరికొకరు సహకరించుకునేలా విధులను వికేంద్రీకరించామని, దీనిద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతాయని పేర్కొన్నారు.