అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట: త్వరలో ఒరిజినల్ బాండ్లు ధ్రువపత్రాల పరిశీలన షురూ
రిపోర్టర్: మహేష్
స్థలం: నెల్లూరు
అగ్రిగోల్డ్ బాధితులకు త్వరలో ఒరిజినల్ బాండ్లు మరియు ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం కానుందని సీఐడీ ఏఎస్పీ ఎస్.శిరీష వెల్లడించారు. బాధితులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాలులో ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. డిపాజిటర్లు లేదా నామినీలు అవసరమైన పత్రాలతో పాటు ఆధార్, బ్యాంకు పాస్పుస్తకపు నకళ్లను అధికారులకు సమర్పించి ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె స్పష్టం చేశారు.