రీసైకిల్ సిమ్ కార్డులతో విజయవాడలో భారీ సైబర్ మోసాలు
రిపోర్టర్: గోపి
స్థలం: విజయవాడ
విజయవాడలో రీసైకిల్ చేసిన సిమ్ కార్డుల వల్ల భారీ మోసాలు వెలుగుచూశాయి. వాడకుండా వదిలేసిన నంబర్లను టెలికాం సంస్థలు ఇతరులకు కేటాయించడంతో, పాత యజమానుల బ్యాంక్ ఖాతాలకు కొత్తవారు యాక్సెస్ పొందుతున్నారు. మాజీ మేయర్ దంపతుల ఖాతా నుంచి రూ. 20 లక్షలు కొల్లగొట్టగా, మరో విద్యార్థిని నంబర్‌తో అసభ్యకర మెసేజ్‌లు పంపిన ఘటనలు కలకలం రేపాయి. సిమ్ రద్దు చేసినప్పుడు బ్యాంక్, సోషల్ మీడియా ఖాతాలను డిలిట్ చేయకపోవడమే ఈ ముప్పుకు ప్రధాన కారణం.