స్థానిక ఎన్నికల్లో వందశాతం స్ట్రైక్ రేట్ సాధించాలి: భాజపా అధ్యక్షుడు మాధవ్
రిపోర్టర్: అశోక్
స్థలం: గుంటూరు
రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు వందశాతం స్ట్రైక్ రేట్ సాధించేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పిలుపునిచ్చారు. గుంటూరులో జరిగిన పార్టీ పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామస్థాయి నుంచి నగరపాలక సంస్థల వరకు భాజపా ప్రాతినిధ్యం ఉండేలా ఇప్పటి నుంచే సిద్ధం కావాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సోము వీర్రాజు వేదికపైకి పిలవడంలో ఆలస్యం కావడంతో అలకబూనడం చర్చనీయాంశమైంది.