అమెరికా ప్రతిష్టాత్మక 6జీ ఇనిషియేటివ్‌లో అధికారికంగా చేరిన భారత్
రిపోర్టర్: హరి
స్థలం: India
అమెరికా ప్రారంభించిన ప్రతిష్టాత్మక 6జీ వైర్‌లెస్ నెట్‌వర్క్ అంతర్జాతీయ భాగస్వామ్య కూటమిలో భారత్ అధికారికంగా చేరింది. భద్రతా ప్రయోజనాలు, సాంకేతిక ఆవిష్కరణలను వేగవంతం చేసే లక్ష్యంతో మొత్తం 26 దేశాలు ఈ కూటమిలో భాగమయ్యాయి. 2030 నాటికి 6జీ నెట్‌వర్క్ రంగంలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.