నాని సినీ ప్రయాణంపై భార్య అంజనా భావోద్వేగ పోస్ట్
రిపోర్టర్: కిరణ్
స్థలం: హైదరాబాద్
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ది ప్యారడైజ్ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో నాని సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన భార్య అంజనా సోషల్ మీడియాలో చేసిన భావోద్వేగ పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. 2009లో నాని సినిమా చూసేందుకు తామంతా వెళ్లామని, నాటి కష్టాలను అంజనా గుర్తుచేసుకున్నారు. సరిగ్గా పదిహేడేళ్ల తర్వాత నాని సంపాదించుకున్న నమ్మకమే ఈ స్థాయికి తెచ్చిందని ఆమె పేర్కొన్నారు.