తెలంగాణలో విద్యుత్ అవసరాల కోసం యాదాద్రి ప్లాంట్కు బొగ్గు సరఫరా: కిషన్ రెడ్డి

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు యాదాద్రి పవర్ ప్లాంట్కు నిరంతరం బొగ్గు సరఫరా చేస్తామని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైడ్రో పవర్ తగ్గడంతో దేశవ్యాప్తంగా బొగ్గు ఆధారిత విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిందని ఆయన వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యవేక్షణలో బొగ్గు కొరతను పూర్తిగా అధిగమించి, విద్యుత్ ఉత్పత్తిని వేగంగా పెంచుతున్నామని ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు.