ఘాజియాబాద్లో దారుణం: వివాహేతర సంబంధం కోసం భర్తను హతమార్చిన భార్య

రిపోర్టర్: కృష్ణ స్థలం: Ghaziabad

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘాజియాబాద్ జిల్లాలోని ఘోడా కాలనీలో వివాహేతర సంబంధం కోసం భర్తను అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన సంచలనం సృష్టించిందని ఏసీపీ సూర్యబలి మౌర్య వెల్లడించారు. భార్య నిషాతో వివాహేతర సంబంధం ఉన్న పాపు అనే వ్యక్తి శనివారం ఇంట్లో ఉన్న అన్షుల్ను కాల్చి చంపాడని, నిందితులు ఇద్దరిని అరెస్టు చేసి హత్య కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.