పాలెంపల్లెలో మూడు లక్షల మట్టి వినాయక విగ్రహాల తయారీ
రిపోర్టర్: రమేష్
స్థలం: కడప
కడప శివారులోని పాలెంపల్లె గ్రామం వినాయక చవితి వేళ మట్టి విగ్రహాల తయారీతో కళకళలాడుతోంది. సుమారు 200 కుటుంబాలు నాలుగు దశాబ్దాలుగా రసాయనాలు లేని మట్టి గణపయ్య ప్రతిమలను తయారు చేస్తున్నాయి. ఒక్కో కుటుంబం రెండు వేల వరకు విగ్రహాలను రూపొందిస్తుండగా, మొత్తం మూడు లక్షల విగ్రహాలు తయారవుతున్నాయి. మట్టి ధరలు పెరగడంతో ప్రభుత్వం తమను ఆదుకోవాలని, పరికరాలు అందించాలని కళాకారులు కోరుతున్నారు.