'ఏసీబీకి అధికార పరిధి లేదు': సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ
రిపోర్టర్: రాము
స్థలం: న్యూఢిల్లీ
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణ సుప్రీంకోర్టులోని త్రిసభ్య ధర్మాసనం ఎదుట మరోసారి చర్చనీయాంశమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య దాఖలు చేసిన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ విచారణ చేపట్టింది. లంచం ఇవ్వడం అనేది ఎన్నికల నేరమే తప్ప ఏసీబీ చట్టం కిందకు రాదని, దర్యాప్తు చేసే అధికార పరిధి ఏసీబీకి లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. ఇరువర్గాల వాదనలు రికార్డు చేసిన ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది.