అమెరికాలో అత్తామామల చేతిలో న్యూయార్క్ టైమ్స్ ఉద్యోగి హత్య

రిపోర్టర్: భాస్కర్ స్థలం: California

న్యూయార్క్ టైమ్స్ టెక్ విభాగంలో పనిచేస్తున్న జొనాథన్ మెకెన్సేని ఆయన అత్తామామలు తుపాకీతో కాల్చి చంపినట్లు కాలిఫోర్నియా పోలీసులు తెలిపారు. ట్రాన్స్జెండర్ గుర్తింపు వివాదం కారణంగానే ఈ హత్య జరిగినట్లు అధికారులు వెల్లడించారు. శస్త్రచికిత్స ద్వారా పురుషుడిగా మారిన మెకెన్సే 2011లో వారి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఈ వివాహంపై అత్తామామల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో పాటు కుటుంబంలో గొడవలు తలెత్తాయి. భార్యాభర్తలు కొంతకాలంగా విడిగా ఉంటున్న నేపథ్యంలో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు నిందితులను అరెస్టు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.