పోలీసులు వేధించారంటూ యువకుడు సెల్ టవర్ ఎక్కి నిరసన
రిపోర్టర్: రమేష్
స్థలం: నస్రుల్లాబాద్
పోలీసులు తన ఫోన్ లాక్కొని అసభ్య పదజాలంతో దూషించి అవమానించారని ఆరోపిస్తూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకుంటానని సెల్ టవర్ ఎక్కిన ఘటన కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే యువకుడు బుధవారం సెల్ టవర్ ఎక్కగా ఎస్సై సాయికృష్ణ ఘటనా స్థలికి చేరుకుని అతనికి నచ్చజెప్పి కిందకు దించారు. ఈ ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.