పార్టీ బలోపేతానికై శ్రమిస్తున్న టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ సన్మానం

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్కుమార్ గౌడ్ రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఘన సత్కారం నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు ఆయనను శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి ఆయన అందిస్తున్న సేవలను కొనియాడారు. భవిష్యత్తులోనూ పార్టీని మరింత విజయపథంలో నడిపించాలని నాయకులు ఆకాంక్షించారు.