తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు: గజవాహనంపై విహరించిన మలయప్పస్వామి

రిపోర్టర్: మహేష్ స్థలం: తిరుమల

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆరో రోజున మలయప్పస్వామి గజవాహనంపై తిరువీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారని ఆలయ అధికారులు తెలిపారు. వర్షం కారణంగా ఘటాటోపం కింద వాహన సేవ ముందుకు సాగిందని, గజరాజులు ఎదుట నడుస్తుండగా భక్తజన బృందాల భజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ కోలాహలంగా ఈ వేడుక నిర్వహించామని వారు వెల్లడించారు. అంతకుముందు ఉభయ దేవేరులతో కలసి పుష్పక విమానంపై స్వామివారు ఊరేగారని భక్తులు పేర్కొన్నారు.