విశాఖలో ప్రజల కోసం నిరంతరం కొనసాగుతున్న కమ్యూనిటీ ఫ్రిజ్‌ల సేవలు
రిపోర్టర్: సతీష్
స్థలం: విశాఖపట్నం
ఆహారం వృథా కాకుండా నిరాశ్రయులకు, ఆకలితో ఉన్నవారికి ఉచితంగా భోజనం అందించాలనే సంకల్పంతో విశాఖ నగర పోలీసులు కమ్యూనిటీ ఫ్రిజ్‌ల సేవలను కొనసాగిస్తున్నట్లు VizagCityPolice వెల్లడించారు. మిషన్ జ్యోతిర్గమయ కార్యక్రమంలో భాగంగా నగరంలో ఇటీవల ఐదు కమ్యూనిటీ ఫ్రిజ్‌లను ప్రారంభించినట్లు తెలిపారు. అలాగే సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఇరవై నాలుగు షార్ట్ ఫిలిమ్స్‌ను ప్రదర్శించామని, వినాయక నిమజ్జన ప్రాంతాలలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని విశాఖ నగర పోలీసులు పేర్కొన్నారు.