ఉద్దానం బిడ్డకు ఘన సన్మానం.. కొనియాడిన మాజీ మంత్రి గౌతు శివాజీ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: వజ్రపుకొత్తూరు
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లిలో ఆంధ్ర ఫోకస్ పత్రిక సబ్ ఎడిటర్ పుక్కళ్ల కరుణ కుమారిని మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజీ ఘనంగా సన్మానించారు. ఉద్దానం సాహితీ సంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమెను దుశ్శాలువతో సత్కరించారు.
ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ, ఉద్దానం ప్రాంతానికి చెందిన మహిళ జర్నలిస్టుగా కరుణ రాణించడం గర్వకారణమని ప్రశంసించారు. తన తండ్రి సర్దార్ గౌతు లచ్చన్న బాటలో నడుస్తూ, ప్రజా సేవలో నిరంతరం కొనసాగుతున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.