ఎన్ఐటీ రాయ్ పుర్ లో సెంటర్స్ ఆఫ్ ఎక్సెలెన్స్ ప్రారంభించిన కిషన్ రెడ్డి
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాయ్ పుర్ లో సెంటర్స్ ఆఫ్ ఎక్సెలెన్స్ కేంద్రాలను కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఎంపీ బ్రిజ్ మోహన్ అగర్వాల్, సిఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ ఎన్.కలైసెల్వి తదితరుల సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం, క్రిటికల్ మినరల్ పరిశోధనలను ముందుకు తీసుకెళ్లడం మరియు ప్రాంతీయ సామాజిక అభివృద్ధికి తోడ్పడటమే ఈ నూతన కేంద్రాల ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.