భోగాపురం విమానాశ్రయం నుంచి బ్యాంకాక్‌కు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నాన్‌స్టాప్ సర్వీసు
రిపోర్టర్: రాము
స్థలం: భోగాపురం
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బ్యాంకాక్‌కు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నాన్‌స్టాప్ విమాన సర్వీసులు ప్రారంభమైనట్లు జీఎంఆర్ యాజమాన్యం వెల్లడించింది. మంగళవారం ప్రారంభమైన ఈ సేవలు వారంలో ప్రతి మంగళవారం, శుక్రవారం అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ నాన్‌స్టాప్ సర్వీసు ద్వారా కేవలం నాలుగు గంటల్లోనే బ్యాంకాక్ చేరుకునే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. మరోవైపు దిల్లీకి కూడా ఆకాశ ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసులు పునఃప్రారంభమైనట్లు వారు స్పష్టం చేశారు.