జనసేనలో చేరిన ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: కాకినాడ
కాకినాడ జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. పిఠాపురంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ స్వయంగా సుబ్బారావుకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల నుంచి పలువురు వైసీపీ ముఖ్య నాయకులు, మాజీ కౌన్సిలర్లు సైతం జనసేన తీర్థం పుచ్చుకున్నారు.