దీపావళి వేళ కల్తీ మిఠాయిల కలకలం: సులభమైన పద్ధతులతో గుర్తించాలని అధికారుల హెచ్చరిక

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: తెలంగాణ

దీపావళి పండుగ వేళ మార్కెట్ లో కల్తీ మిఠాయిల బెడద పెరుగుతోందని, ప్రజలు కొనుగోలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆహార భద్రతా అధికారులు హెచ్చరించారు. లైసెన్సు ఉన్న దుకాణాలలో మాత్రమే మిఠాయిలు కొనుగోలు చేయాలని, రంగులు మారిన వాటిని గుర్తించి ఐడియాడిన్ పరీక్షల ద్వారా కల్తీని సులభంగా కనిపెట్టవచ్చని సూచించారు. ఆరోగ్యకరమైన పదార్థాలతో తయారు చేసిన స్వీట్లను ఎంచుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.