లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మంచిర్యాల జిల్లా జీపీవో

రిపోర్టర్: సురేష్ స్థలం: మంచిర్యాల

మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని పెద్దపేట గ్రామ పరిపాలనా అధికారి దుర్గాప్రసాద్ భూమిని తన పేరుమీదుగా బదిలీ చేసి పట్టా పాస్‌బుక్ ఇప్పించేందుకు రూ. 1,30,000 లంచం డిమాండ్ చేశారు. మొదటి విడతగా రూ. 80,000 లంచం తీసుకుంటుండగా ఆదిలాబాద్ రేంజ్ ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతనికి సహకరించిన పోతు రాజేందర్‌ను కూడా అరెస్ట్ చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.