గోరుపై బాలిక చిత్రాన్ని గీసి నెయిల్ ఆర్టిస్ట్ కళాత్మక నిరసన

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: ఆత్మకూరు

అనంతపురం జిల్లా రాప్తాడు పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ అమానుష ఘటనపై ప్రముఖ నెయిల్ ఆర్టిస్ట్ డాక్టర్ నరహరి మహేశ్వరం తీవ్రంగా స్పందించారు. తన చేతి గోరుపై బాధితురాలి చిత్రాన్ని గీసి కళాత్మకంగా నిరసన తెలిపారు. బాలికలపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.