'భూముల లెక్కలు తేల్చండి..': కేసీఆర్ ఫామ్‌హౌస్ రికార్డులను పరిశీలిస్తున్న అధికారులు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: తెలంగాణ

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ భూముల వ్యవహారంపై రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మర్కుక్ తహశీల్దార్ కార్యాలయంలో అధికారులు పాత రికార్డులు, సర్వే నంబర్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎర్రవల్లి, వెంకటపూర్ పరిధిలో ఉన్న సుమారు 388 ఎకరాల ప్రభుత్వ భూమిపై త్వరలో కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చే యోచనలో అధికారులు ఉండటంతో ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.