అర్నబ్ తుపాను ముప్పు: అధికారులతో అత్యవసరంగా సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు

రిపోర్టర్: విజయ్ స్థలం: Andhra Pradesh

అర్నబ్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధికారులతో అత్యవసరంగా సమీక్ష నిర్వహించారు. అర్నబ్ తుపాను గమనాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి తక్షణ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, తుపాను ప్రభావానికి అనుగుణంగా ప్రజల్ని నిరంతరం అప్రమత్తం చేయాలని, భారీ వర్షాల ముప్పు పొంచివున్న ప్రాంతాల్లో రక్షణ చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించినట్లు సీఎంవో ఆంధ్రప్రదేశ్ స్పష్టం చేసింది.